శిక్షణతో మత్స్యకారుల జీవితాల్లో మార్పు

ABN , First Publish Date - 2022-08-17T05:07:56+05:30 IST

శిక్షణతో మత్సకారుల జీవితాల్లో మార్పు రానుందని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ తెలిపారు.

శిక్షణతో మత్స్యకారుల జీవితాల్లో మార్పు
జెండా ఊపి బస్సును ప్రారంభిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌:


 కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ 

కలెక్టరేట్‌, ఆగస్టు 16: శిక్షణతో మత్సకారుల జీవితాల్లో మార్పు రానుందని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ తెలిపారు. ఎంఎన్‌ స్వామినాథన్‌ ఫౌండేషన్‌ ద్వారా తమిళనాడులోని పూంపుహార్‌లోని షిప్‌ ఫర్‌ ఆల్‌ రీసెర్స్‌ అండ్‌ ట్రైయినింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందేందుకు జిల్లాకు చెందిన 33 మంది మత్స్యకా రులు బస్సులో బయలుదేరారు. ఈ బస్సును మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం వద్ద వ్యవసాయ సలహా మండలి  చైర్మన్‌ శిమ్మ నేతాజీతో కలసి కలెక్టర్‌  జెండా ఊపి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారులు శిక్షణ నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్లడం ఇదే ప్రథమమని చెప్పారు. వారం రోజుల పాటు ఇచ్చే శిక్షణ మిగిలిన అనుబంధ రంగాలైన  వ్యవసాయం, సూక్ష్మ, నీటిపారుదల, ఉద్యాదనవనం వంటి శాఖలకు స్ఫూర్తికావాలన్నారు.  కార్యక్రమంలో మత్స్యకార సంఘ ప్రతినిధులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. 



 


Updated Date - 2022-08-17T05:07:56+05:30 IST