పిల్లల ప్రవర్తన మార్చండిలా...

ABN , First Publish Date - 2022-03-16T17:12:33+05:30 IST

ఇప్పటి తరం పిల్లల మాటలు కోటలు దాటుతాయి. పిల్లల మాటల్లో పెద్దరికం కనిపిస్తుంటుంది. నిజాలను ఇట్లే చెప్పేసే గుణం వారిది. అల్లరితో పాటు వారిలోని విపరీతమైన అగ్రెసివ్‌నె్‌సను తగ్గించాలంటే.. పేరెంట్స్‌ కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి.

పిల్లల ప్రవర్తన మార్చండిలా...

ఆంధ్రజ్యోతి(16-03-2021)

ఇప్పటి తరం పిల్లల మాటలు కోటలు దాటుతాయి. పిల్లల మాటల్లో పెద్దరికం కనిపిస్తుంటుంది. నిజాలను ఇట్లే చెప్పేసే గుణం వారిది. అల్లరితో పాటు వారిలోని విపరీతమైన అగ్రెసివ్‌నె్‌సను తగ్గించాలంటే.. పేరెంట్స్‌ కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి.


ఆరేళ్లలోపు చుట్టూ కనిపించేదంతా పిల్లలు మెదళ్లలో బ్లూప్రింట్‌ అవుతుంది. దానికి బట్టే వాళ్ల ప్రవర్తన ఉంటుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు తల్లిదండ్రులు మంచి అలవాట్లను నేర్పించాలి.

చుట్టూ ఉండే వాతావరణానికి పిల్లలలు సులువుగా ప్రభావితమవుతారు. పక్కింటి పిల్లలు, స్నేహితులను బట్టే పిల్లల అలవాట్లు మారిపోతాయి. తప్పుగా మాట్లాడితే.. ఆ మాట ఎక్కడనేర్చుకున్నారో ఆరా తీయాలి. చెడు స్నేహాలకు దూరంగా ఉంచాలి. 

ప్రవర్తన బావుంటే మెచ్చుకోవాలి. మంచి, చెడులను చర్చించాలి. గట్టిగా మాట్లాడటం, మంకుపట్టి పట్టి ఏడవటం, ఏదైనా వస్తువు కనపడితే.. అదే కావాలని నేలమీద పడి దొర్లాడటం చేస్తే కచ్చితంగా పేరెంట్స్‌ అందరిముందు ఇబ్బందిగా ఫీలవుతారు. ఇలా చేసేవాళ్లను అదుపులో పెట్టాలంటే.. ఎవరోకరి భయం ఉండాలి. దీంతో పాటు వారు చేసే ప్రతి పనిని మంచిది అన్నా తలనొప్పే. బ్యాలెన్స్‌గా ఉండాలి. తిట్టడం, అరవటం చేస్తే మంచిది కాదనే విషయం తెలియచెప్పాలి. 

ఇతర పిల్లలను కొట్టడం చేస్తే మందలించాలి. అలా చేయద్దని అర్థమయ్యేట్లు చెప్పాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాలను ఇంట్లో వాళ్లు పిల్లల ముందు మాట్లాడకూడదు. 

ఎంత బిజీగా ఉన్నా పిల్లలతో గడపాలి. వారికి సమయం ఇవ్వాలి. ఆనందంగా గడపాలి. స్నేహితుడిలాగా మాట్లాడితే కచ్చితంగా పిల్లల మనసులోని మాటల్ని చెబుతారు. ఆనందంగా ఉన్నప్పుడే పిల్లల మైన్‌సల గురించి చర్చించాలి.    పిల్లలతో కలిసి ప్రయాణం చేసినపుడే.. వారి ఎమోషన్స్‌ అర్థం చేసుకోగలం. అప్పుడే వారి ప్రవర్తననూ మార్చొచ్చు.

Updated Date - 2022-03-16T17:12:33+05:30 IST