ఊరేగింపులో పాల్గొన్నాడని కొరడా దెబ్బలు, జైలు.. బయటకు వచ్చాక ‘ఆజాద్’గా మారిపోయాడు... స్ఫూర్తి దాయక స్టొరీ!

ABN , First Publish Date - 2021-12-16T15:43:59+05:30 IST

నాటి భారత జాతీయ ఉద్యమంలో చురుకుగా..

ఊరేగింపులో పాల్గొన్నాడని కొరడా దెబ్బలు, జైలు.. బయటకు వచ్చాక ‘ఆజాద్’గా మారిపోయాడు... స్ఫూర్తి దాయక స్టొరీ!

నాటి భారత జాతీయ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న చంద్రశేఖర్ ఆజాద్ యువకునిగా ఉన్నప్పుడు జరిగిన ఘటన ఇది. చంద్రశేఖర్ భారత జాతీయ జెండాను పట్టుకుని ఊరేగింపుగా వెళ్తున్నారు. ఆ ఊరేగింపులో పాల్గొన్నవారు.. ‘బ్రిటీషర్లు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలి. గాంధీ.. జిందాబాద్, మన దేశానికి స్వాతంత్ర్యం రావాలి’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లాఠీచార్జీ జరిగింది. పోలీసులు.. చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 'నీ పేరేమిటి?' అని అడిగారు

'ఆజాద్' అని ఆ యువకుడు బదులిచ్చాడు.

జడ్జి.. తండ్రి పేరు అడగగా.. 'స్వాధీన్’ అని ఆ యువకుడు బదులిచ్చాడు.

తాను అడిగిన ప్రశ్నకు ఆ యువకుడు తగిన సమాధానం ఇవ్వడంలేదని ఆ జడ్జికి అర్థమైంది. న్యాయమూర్తి కోపంగా, 'మీరు ఎక్కడ ఉంటున్నారు?' అని అడిగారు.




ఆ యువకుడు, 'జైలులో ఉన్నాను. నా ఇల్లు జైలు’ అని చెప్పాడు. వెంటనే న్యాయమూర్తి అతనిని జైలుకు తరలించాలని ఆదేశించారు. దానికి ముందు అందరి సమక్షంలో ఆ యువకునికి 15 కొరడా దెబ్బలు కొట్టాలని కూడా ఆదేశించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు శిక్ష అమలయ్యింది. ఆ యువకుడిని పోలీసులు కొడుతున్నప్పుడు అతను ‘వందేమాతరం.. వందేమాతరం’ అని అంటూనే ఉన్నాడు. కొద్దిరోజుల తర్వాత ఆ యువకుడు జైలు నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు నాటి ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సంపూర్ణానంద్ ఆ యువకుడినితో మాట్లాడుతూ.. 'నీ పేరు చంద్రశేఖర్. నువ్వు కోర్టులో ఆ జడ్జితో మాట్లాడిన తీరు చూసి.. నేను నీకు కొత్తగా ఆజాద్ అనే పేరు పెడుతున్నా’ అన్నారు. నాటి నుంచి ఆ యువకుని పేరు చంద్రశేఖర్ ఆజాద్‌గా మారింది. ఒక వ్యక్తి తాను చేసే ఉత్తమ పని ద్వారా గుర్తింపు వస్తుందని ఈ సంఘటన తెలియజేస్తోంది.  మనం మంచి పనులు చేసినప్పుడు, ఆ పనుల వల్ల మనకు గుర్తింపు వస్తుందని గ్రహించవచ్చు.

Updated Date - 2021-12-16T15:43:59+05:30 IST