Advertisement
Advertisement
Abn logo
Advertisement

అక్కడి మేఘాల వానను చూసేందుకు జనం ఉరుకులు పరుగులు... కారణం తెలిసి షాక్!

చంద్రపూర్: మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో మేఘాల వాన కురిసింది. దీనిని చూసిన స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. ఆ సమయంలో ఆకాశం నుంచి మేఘాలు చిన్నచిన్న ముక్కలుగా పడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రోడ్లపైన, ఇళ్లపైన చిన్నచిన్న మేఘం ముక్కలు రాలిపడటం కనిపించింది. నిజానికి కాలుష్యం కారణంగా ఎగిరిన నురుగే అది అని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ఆ కాలుష్యపు నురుగు వర్షంతోపాటు కలిసి కిందకు పడుతోందన్నారు. వర్షాలు, వాతావరణంలోని కాలుష్యం మధ్య జరిగిన రసాయన చర్య కారణంగా ఈ విధమైన మేఘాల తునకల వర్షం కురిసిందని పేర్కొన్నారు. కాగా ఈ మేఘాల తునకలు రెండు కిలోమీటర్ల పరిధిలో కురిశాయి. ఈ సందర్భంగా స్థానికులు వీడియో తీశారు. ఇటువంటి వింత వర్షం కురిసిన చంద్ర‌పూర్‌లో థర్మల్ పవర్ స్టేషన్‌తో పాటు బొగ్గు గనులు కూడా ఉన్నాయి. వీటికారణంగా ఈ ప్రాంతంలో వాయు కాలుష్యం ఏర్పడుతోంది.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement