Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 11 Aug 2022 10:27:22 IST

Chandramukhi-2: లేటెస్ట్ అప్‌డేట్..

twitter-iconwatsapp-iconfb-icon

ప్రముఖ డాన్స్ మాస్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం 'చంద్రముఖి-2' (Chandramukhi-2). ఈ మూవీ షూటింగ్‌పై మేకర్స్ తాజాగా అప్‌డేట్ ఇచ్చారు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కెరియర్లో మైల్ స్టోన్‌గా నిలిచిన సినిమాలలో 'చంద్రముఖి' కూడా ఒకటి. 2005లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా దర్శకుడు పి.వాసు (P. Vasu) 'చంద్రముఖి 2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వాస్తవంగా రజినీతోనే ఈ సీక్వెల్ మూవీని కూడా ప్లాన్ చేశారు పి.వాసు.

ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన చాలా కాలం ఎదురుచూశారు కూడా. కానీ, రజనీకాంత్ కొన్ని కారణాల వల్ల ఈ మూవీని ఒప్పుకోలేదు. దాంతో లారెన్స్ తో మొదలుపెట్టారు. గతంలో పి.వాసు - లారెన్స్ కాంబినేషన్‌లో 'శివలింగ' చిత్రం వచ్చి మంచి హిట్ సాధించింది. అందుకే, రజినీ స్థానంలో లారెన్స్‌ని తీసుకున్నారు. ఇక 'చంద్రముఖి 2' సినిమా మొదలయ్యే ముందు లారెన్స్ నేరుగా రజనీ దగ్గరికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకుని షూటింగుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్టు షెడ్యూల్ ను మైసూర్ లో ప్లాన్ చేశారు. లారెన్స్ తో పాటు ముఖ్య తారాగణంపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

Chandramukhi-2: లేటెస్ట్ అప్‌డేట్..

ఈ నేపథ్యంలో 'చంద్రముఖి 2' మేజర్ షెడ్యూల్ షూటింగ్ తాజాగా ముగిసింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అంతేకాదు, ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్న రాధిక కూడా లారెన్స్, మరో నటుడు వడివేలుతో లొకేషన్‌లో సరదాగా గడిపిన ఓ వీడియోను ట్వీట్టర్‌లో షేర్ చేశారు. కాగా, ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ ఉండగా, వారిలో 'చంద్రముఖి' పాత్రను చేస్తుంది ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. 2023 సమ్మర్ కానుకగా 'చంద్రముఖి 2' రిలీజ్ చేయనున్నారట.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement