అమరావతి: తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సకల శుభాలు కలిగించాలని ఆకాంక్షించారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కష్టాలు తొలగి.. ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. పాలకుల పాపాలకు పెరిగిన ధరలతో కష్టాలు పడిన ప్రజలకు కొత్త సంవత్సరంలో మంచి జరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
అంతకుముందు తెలుగు వారి ఉగాది సంవత్సరం శుభకృత్లో ప్రజలకు సర్వశుభాలు కలగజేయాలని టీడీపీ నేత నారా లోకేష్ ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో తలపెట్టిన కార్యాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. అచ్చతెలుగు పండుగని ఇంటిల్లిపాదీ ఆనందంతో జరుపుకోవాలన్నారు.
ఇవి కూడా చదవండి