6,7,8 తేదీల్లో కుప్పంలో చంద్రబాబు పర్యటన

ABN , First Publish Date - 2022-01-01T20:40:33+05:30 IST

ఈనెల 6,7,8 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన వివిధ

6,7,8 తేదీల్లో కుప్పంలో చంద్రబాబు పర్యటన

అమరావతి: ఈనెల 6,7,8 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని కార్యకర్తలు, ప్రజలను కలవనున్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికలకు ముందు చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత మొదటిసారి కుప్పంలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే కుప్పం నేతలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇప్పుడు నేరుగా ఆ పార్టీ నేతలను చంద్రబాబు కలుస్తారు. నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం, నేతల మధ్య నెలకొన్న సమన్వయం, ఇతర అంశాలపై చంద్రబాబు ఆరా తీస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Updated Date - 2022-01-01T20:40:33+05:30 IST