వైద్యులు, శాస్త్రవేత్తలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

ABN , First Publish Date - 2020-04-01T20:15:31+05:30 IST

వైద్యులు, శాస్త్రవేత్తలు, ఇతర నిపుణులతో ప్రతిపక్ష నేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచాలని, ఆరోగ్య మార్గదర్శకాలపై చైతన్యపర్చాలని సూచించారు.

వైద్యులు, శాస్త్రవేత్తలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

అమరావతి: వైద్యులు, శాస్త్రవేత్తలు, ఇతర నిపుణులతో ప్రతిపక్ష నేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచాలని, ఆరోగ్య మార్గదర్శకాలపై చైతన్యపర్చాలని సూచించారు. ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్‌లో లోపాల వల్లే ఇటలీ, స్పెయిన్ దేశాల్లో కరోనా నియంత్రణ అసాధ్యంగా మారిందని గుర్తుచేశారు. 4టీ విధానం వల్లే దక్షిణ కొరియా ఈ మహమ్మారిని నిరోధించగలిగిందని చెప్పారు. కరోనా నిరోధానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్నివర్గాల్లో అవగాహన పెంచడం ద్వారా ప్రజలను చైతన్య పర్చాలని వైద్యులు, శాస్త్రవేత్తలకు చంద్రబాబు పలు సూచనలు చేశారు.

Updated Date - 2020-04-01T20:15:31+05:30 IST