అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వట్టర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ప్రాథమిక హక్కులు కల్పిస్తూ.. రక్షణగా నిలిచే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజని అన్నారు. రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలం అయితే... అది ప్రజలకు తీరని నష్టం చేసినట్లేనన్నారు. రాజ్యాంగ నియమాలు అపహాస్యం అవుతున్న వేళ ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉద్యమించాలని పిలుపిచ్చారు. ఆ పోరాటంలో తెలుగు దేశం పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుందని చంద్రబాబు ట్వీట్ చేశారు.