అబ్దుల్ కలాం అంటే ఒక స్ఫూర్తి శిఖరం: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-10-15T15:14:17+05:30 IST

అబ్దుల్ కలాం అంటే ఒక స్ఫూర్తి శిఖరం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

అబ్దుల్ కలాం అంటే ఒక స్ఫూర్తి శిఖరం: చంద్రబాబు

హైదరాబాద్: దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘‘అబ్దుల్ కలాం అంటే ఒక స్ఫూర్తి శిఖరం. పరిణతి సాధించిన అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతం. దేశ అణు, శాస్త్రీయ రంగాలకు సరికొత్త మార్గనిర్దేశనం చేసిన దార్శనికుడు, గురువారం ఆయన జయంతి సందర్భంగా ఆ మానవతావాది దేశ, సమాజ సేవలను స్మరించుకుందాం’’ అంటూ ట్వీట్ చేశారు.



Updated Date - 2020-10-15T15:14:17+05:30 IST