అమరావతి: టీడీపీ (TDP) అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలని చెప్పారు. బోస్టన్లో నిర్వహించిన మహానాడులో ఆన్లైన్లో చంద్రబాబు (Chandrababu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోస్టన్లో 2,200 మందితో మహానాడు నిర్వహణ గర్వకారణమన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం కోలుకోలేనంతగా నష్టపోయిందని దుయ్యబట్టారు. తనతో పాటు కేసుల్లో ఉన్నవారికి జగన్ రాజ్యసభ సీటు ఇచ్చారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే ఇస్తామని ప్రకటించారు. టీడీపీని అధికారంలోకి తీసుకురావడంలో ఎన్ఆర్ఐలు కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి