వ్యక్తిగత స్వార్ధం.. ఎమ్మెల్యే వాసుపల్లిపై చంద్రబాబు ఆగ్రహం

ABN , First Publish Date - 2020-09-20T02:01:45+05:30 IST

టీడీపీ నాయకులతో అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ వైసీపీకి..

వ్యక్తిగత స్వార్ధం.. ఎమ్మెల్యే వాసుపల్లిపై చంద్రబాబు ఆగ్రహం

విశాఖ: టీడీపీ నాయకులతో అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ వైసీపీకి మద్దతు ఇవ్వడంపై ఆయన స్పందించారు. ప్రలోభాలకు లోనై పార్టీకి ద్రోహం చేయడం హేయమని చంద్రబాబు అన్నారు. వ్యక్తిగత స్వార్ధంతో పార్టీకి ద్రోహం చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఎన్నికష్టాలు ఎదురైనా కార్యకర్తలు టీడీపీ వెన్నంటే ఉంటారని చెప్పారు. స్వార్ధంతో ఒకరిద్దరు పార్టీ నుంచి పోయినా నష్టం లేదని స్పష్టం చేశారు. ‘నాయకులు వస్తారు.. పోతారు‘, పార్టీ, కార్యకర్తలు శాశ్వతమని తెలిపారు. జెండాను మోసి గెలిపించేది కార్యకర్తలేనన్నారు. జెండా పంచన చేరిన కొందరు పార్టీకి ద్రోహం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ద్రోహులకు టీడీపీలో స్థానం లేదన్నారు. పార్టీకి ద్రోహం చేసినవాళ్లకు రాజకీయ సమాధేనని చంద్రబాబు అన్నారు. విశాఖ తెలుగుదేశం పార్టీకి కంచుకోటని.. హుద్‌హుద్‌ సమయంలో టీడీపీ కష్టాన్ని ప్రజలు మర్చిపోరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-09-20T02:01:45+05:30 IST