Advertisement
Advertisement
Abn logo
Advertisement

నవరత్నాలను నమ్మి.. ఇప్పుడు నవగ్రహాలు చుట్టూ తిరుగుతున్నారు : చంద్రబాబు

అమరావతి : ఏపీ ప్రజలు నవరత్నాలను నమ్మి.. ఇప్పుడు నవగ్రహాలు చుట్టూ తిరుగుతున్నారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ‘ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి దివ్యాంగులు తరలివచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దివ్యాంగుడైన కోటేశ్వరరావు ఎన్టీఆర్‌కు, తనకు పైలట్‌గా ఉండేవారని చెప్పుకొచ్చారు. ప్రతి టూర్‌లో కోటేశ్వరరావు ముందు వెళ్లేవారన్నారు. దివ్యాంగుల కోసం ఒక కార్పొరేషన్ పెట్టి లక్షల మందికి సాయం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బాబు గుర్తు చేశారు.

ఆ బాధ్యత నేను తీసుకుంటా..

విభిన్న ప్రతిభావంతులకు రూ.500 ఉండే పెన్షన్..3 వేలు చేశాం. ఎప్పుడో ఎన్టీఆర్ కట్టిన ఇంటికి ఇప్పుడు జగన్ పట్టా ఇస్తాను అంటున్నాడు. డ్వాక్రా మహిళపై వేధింపులు మొదలు పెట్టారు. రాజ్యాంగం ఇంకా బతికే ఉంది.. తప్పును ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది. అధికారంలోకి వచ్చిన తరువాత కమిషన్ వేయడం ఖాయం.. ఇప్పుడు తప్పు చేసిన వారిపై అప్పుడు చర్యలు తప్పవు. రాక్షస జాతిలా ఈ ప్రభుత్వం ప్రజలను పీల్చుకుతింటోంది. చట్ట సభలకు దివ్యాంగులను పంపే బాధ్యత నేను తీసుకుంటా!. దివ్యాంగులకు రిజర్వేషన్‌లు ఇచ్చే ప్రయత్నం చేస్తాను అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement