మహానాడు నిర్వహణపై కమిటీలతో Chandrababu సమీక్ష

ABN , First Publish Date - 2022-05-16T21:10:17+05:30 IST

మహానాడు నిర్వహణపై కమిటీలతో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సమీక్ష నిర్వహించారు.

మహానాడు నిర్వహణపై కమిటీలతో Chandrababu సమీక్ష

అమరావతి: మహానాడు నిర్వహణపై కమిటీలతో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సమీక్ష నిర్వహించారు. ఒంగోలు మండవారిపాలెంలో ఈనెల 27, 28న మహానాడు జరుగనుంది భావజాలం చాటేలా మహానాడు (mahanadu) నిర్వహించాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. మొదటి రోజు ప్రతినిధుల సభ, రెండోరోజు బహిరంగ సభ ఉంటుంది. మహానాడు నిర్వహణకు ఒంగోలు మినీ స్టేడియంను టీడీపీ కోరింది. స్టేడియం ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం నిరాకరించింది. వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.


మహానాడులో భాగంగా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కార్యక్రమం ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షుల నియామకం నిర్ణయాన్ని జాతీయ అధ్యక్షుడు ఖరారు చేయనున్నారు. ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహణ ఆనవాయితీగా వస్తోంది. ఒక ఏడాది ఎన్నికల కారణం, రెండు ఏళ్ళు కోవిడ్ కారణంగా మాహానాడు ఆన్‌లైన్ కే పరిమితమైంది.

Updated Date - 2022-05-16T21:10:17+05:30 IST