అమరావతి: పల్నాడు జిల్లా రెంటచింతలలో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దైవ దర్శనానికి వెళ్లి ఇంటికి వస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు స్థానికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుబాలకు సంతాపం తెలిపిన చంద్రబాబు.. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి