Abn logo
Jul 16 2021 @ 19:34PM

రాయలసీమ ఎత్తిపోతలపై చంద్రబాబు వైఖరేంటో చెప్పాలి: సజ్జల

అమరావతి: రాయలసీమ లిఫ్ట్‌పై టీడీపీ అపోహలు సృష్టించేందుకు చూస్తోందని, రాయలసీమ ఎత్తిపోతలపై చంద్రబాబు వైఖరేంటో చెప్పాలని ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవర్ జనరేషన్ కోసం నీటిని కిందకి వదిలారని, ఇదంతా కేఆర్‌ఎంబీ పరిధి నిర్ణయించకపోవడం వల్లే జరిగిందని తెలిపారు. అందుకే సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. ఏడేళ్ల తర్వాత ఇది ఒక పెద్ద ముందడుగుగా చెప్పొచ్చని సజ్జల వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా వారికి అన్యాయం జరగదని, వెలిగొండను పూర్తి చేస్తున్నామని చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం చేయాల్సి ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.