Kuppam పర్యటనలో CI ను మెచ్చుకున్న చంద్రబాబు.. ఎందుకంటే..!

ABN , First Publish Date - 2021-10-31T18:48:36+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో....

Kuppam పర్యటనలో CI ను మెచ్చుకున్న చంద్రబాబు.. ఎందుకంటే..!

చిత్తూరు జిల్లా/కుప్పం : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో రెండవ రోజు పోలీసు భద్రత ఎక్కువగా కనిపించింది. శుక్రవారం కుప్పం బహిరంగ సభ వద్ద అరకొర పోలీసులే ఉండటంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. దీంతో  పోలీసులు రెండవ రోజు ఆయన పర్యటనలో భద్రతను పెంచారు. మొదటిరోజు వందలోపు కనిపించగా, రెండవ రోజు రెండు వందల మంది పోలీసులు సందడి చేశారు.


కుప్పం అర్బన్‌ సీఐకి ప్రశంస

ఇటీవల కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ నేత దుర్భాషలాడగా ఫిర్యాదు చేసేందుకు వచ్చిన టీడీపీ వారిని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన అర్బన్‌ సీఐ సాదిక్‌అలీపై శాంతిపురానికి చెందిన ఓ నేత దాడి చేస్తే నిక్కచ్చిగా వ్యవహరించి కేసు నమోదుచేశారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు సీఐ సాదిక్‌అలీ పనితీరును ప్రశంసించారు. శనివారం ఉదయం ఆయన బసచేసిన బస్సులోకి అర్బన్‌, రూరల్‌ సీఐలను పిలిచి నిజాయితీగా ఉండాలని సూచించారు.


బస్సులోనే బాబు బస 

చంద్రబాబు శుక్రవారం రాత్రి బస్సులోనే బస చేశారు. గత పర్యటనలో ఆయన బసచేసిన ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి విద్యుత్‌ సరఫరా కట్‌ కావడంతో  ఇబ్బంది పడ్డారు. దీంతో అతిథి గృహ ఆవరణలో ఆ బస్సును పెట్టి రాత్రి 1.20 నిమిషాలకు లోపలకు వెళ్ళి శనివారం ఉదయం 9.20 నిమిషాలకు బయటకు వచ్చారు. తిరిగి రెండవ రోజు బస్సులోనే బసచేశారు.


మరింత అభివృద్ధి చేసుకుందాం..

రాబోయే కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీకే పట్టంకట్టాలని, తద్వారా కుప్పాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని చంద్ర బాబు నాయుడు అన్నారు. శనివా రం రాత్రి కుప్పం మున్సిపల్‌ పరిధి లోని పరమసముద్రం, డీకే పల్లె గ్రామాల్లో ఆయన పర్యటించారు. మహిళల సమస్యలను అడిగి తెలుసుకుని వారితో సెల్ఫీలు దిగు తూ ముందుకు కదిలారు. వృద్ధుల ను పలకరిస్తూ, పిల్లలను ఎత్తు కుని వారితో ముచ్చటించారు. పర్య టనలో వడ్డిపల్లెకు వెళ్లేలా షెడ్యుల్‌ ఉన్నా రోడ్డు సరిగాలేదని ఆ పర్యటన రద్దు చేశారు. మండల తెలుగు మహిళ మాజీ అధ్యక్షురాలు కాంచనమ్మ ఇంటికి వెళ్ళి ఆమెను పరామర్శించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అమరనాథరెడ్డి,  ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌, టీడీపీ చిత్తూరు ఇన్‌చార్జ్‌ పులివర్తినాని, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-31T18:48:36+05:30 IST