అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు పూర్వవైభవం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు తనను ఎందుకు ఎన్నుకోలేదో ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే రాజకీయ చిత్రపటంలో చంద్రబాబు పేరు ఉండదని జోస్యం చెప్పారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సుపరిపాలన అందిస్తున్నామని చెప్పారు. 3 రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. త్వరలో కొత్త బిల్లుతో ప్రజల ముందుకొస్తామని ప్రకటించారు. కుప్పం మైనింగ్‌లో అక్రమాలు జరిగాయనడం అవాస్తవమని కొట్టిపారేశారు. మైనింగ్‌కు సంబంధించి కమిటీ వేసి విచారణ జరిపిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఇవి కూడా చదవండి