ప్రకాశం: స్వర్గీయ ఎన్టీఆర్(NTR) శతజయంతి ఉత్సవాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాబు మాట్లాడుతూ... తెలుగు ప్రజల పౌరుషం ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. పేదల సంక్షేమం కోసం పాటుపడిన మహావ్యక్తి అని కొనియాడారు. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి