చంద్రబాబునాయుడు పర్యటన విజయవంతం

ABN , First Publish Date - 2022-05-19T05:30:00+05:30 IST

టీడీజీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతమైందని కడ ప నియోజకవర్గం టీడీపీ ఇనచార్జ్‌ అమీర్‌బాబు పేర్కొన్నారు.

చంద్రబాబునాయుడు పర్యటన విజయవంతం
విలేకరులతో మాట్లాడుతున్న అమీర్‌బాబు

వీఎస్‌ అమీర్‌బాబు 

కడప(ఎర్రముక్కపల్లి), మే 19 : టీడీజీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతమైందని కడ ప నియోజకవర్గం టీడీపీ ఇనచార్జ్‌ అమీర్‌బాబు పేర్కొన్నారు. కడప నగరం కోఆపరేటీవ్‌ కాలనీలోని తన కార్యాయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బాదుడే బాదుడులో భాగంగా కడప జిల్లా పర్యటన పట్ల ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. చంద్రబాబునాయుడు ఈ రాష్ట్రానికి దశ దిశ అని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డి నగర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జలతోటి జయకుమార్‌ రాష్ట్ర మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి నాసర్‌ అలీ, రమణారెడ్డి, సానపురెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T05:30:00+05:30 IST