అమరావతి: కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో కుప్పం మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పరిస్థితులు, స్థానిక నేతల పని తీరుపై కూడా చర్చించారు. అలాగే స్థానిక టీడీపీ నాయకత్వంలో మార్పులు చేసే అవకాశం ఉంది.