ఘనంగా చంద్రబాబు జన్మదినం

ABN , First Publish Date - 2021-04-21T06:00:16+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు జన్మదిన వేడుకలను మంగళవారం దర్శిలో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా చంద్రబాబు జన్మదినం
కేకు కట్‌ చేస్తున్న నారిశెట్టి పాపారావు

దర్శి, ఏప్రిల్‌ 20 : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు జన్మదిన వేడుకలను మంగళవారం దర్శిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నారాపుశెట్టి పాపారావు, స్థానిక టీడీపీ కార్యాలయంలో పుట్టినరోజు కేకు కట్‌ చేసి అభిమానులకు పంచారు. కార్యక్రమంలో దర్శి మండల టీడీపీ అధ్యక్షుడు నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి పట్టణ టీడీపీ అధ్యక్షుడు దారం సుబ్బారావు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు జి.స్టీవెన్‌, టీడీపీ నేతలు శోభారాణి, సంగా తిరుపతిరావు, మారెళ్ళ వెంకటేశ్వర్లు, జిసి గురవయ్య, మారం శ్రీనివాసరెడ్డి, యస్వీ రామయ్య, తిరుపతయ్య పాల్గొన్నారు. అదేవిదంగా మండలంలోని తూర్పువీరాయపాలెంలో టీడీపీ లీగల్‌సెల్‌ అధ్యక్షుడు పరిటాల సురేష్‌, నాయకులు ఎం.కొండలు, రత్తయ్య తదితరులు స్ధానిక ఆంజనేయస్వామి గుడిలో పూజలు చేశారు. ముండ్లమూరు మండలంలోని పెదఉల్లగల్లులో  బస్టాండ్‌ కూడలిలో ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

కనిగిరిలో  జూనియర్‌ ఎన్టీఆర్‌ సేవాదళ్‌ ఆధ్వర్యంలో గార్లపేట రోడ్డులోని వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేశారు. పండ్లు, రొట్టెలు అందజేశారు. 

కందుకూరులో టీడీపీ అభిమానులు కేజీబీవీలోని విద్యార్థినులకు కరోనా నుండి రక్షణ కై మాస్క్‌లు, శానిటైజర్లు అందజేశారు.ఉలవపాడులోని ఎన్‌టీఆర్‌ విగ్రహం కూడలిలో కేకు కట్‌చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు.  ఆయా  కార్యక్రమాల్లో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-21T06:00:16+05:30 IST