పార్టీ శ్రేణులతో నేడు, రేపు చంద్రబాబు సమావేశాలు

ABN , First Publish Date - 2022-01-04T13:14:40+05:30 IST

చంద్రబాబు నాయుడు మంగళ, బుధవారాలు పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నారు.

పార్టీ శ్రేణులతో నేడు, రేపు చంద్రబాబు సమావేశాలు

మంగళగిరి (గుంటూరు జిల్లా): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళ, బుధవారాలు పార్టీ శ్రేణులతో  భేటీ కానున్నారు. ఈ రెండు రోజులు పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశాలు జరగనున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు చంద్రబాబు వ్యూహం రచిస్తున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు కార్యాచరణ రూపొందిస్తున్నారు. బుధవారం అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో చంద్రబాబు భేటీ కానున్నారు. 

Updated Date - 2022-01-04T13:14:40+05:30 IST