చంద్రబాబు అంటే జగనకు వణుకు

ABN , First Publish Date - 2021-03-02T05:14:47+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంటే సీఎం వైఎస్‌ జగనకు వణుకు అని అందుకే ఆయన పర్యటనను అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. వైసీపీ దౌర్జన్యాలు, దాష్టీకాలను ప్రజలకు

చంద్రబాబు అంటే జగనకు వణుకు
కడపలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలు

డీఎస్సీ 537 - 



అందుకే ఆయన పర్యటనను అడ్డుకుంటున్నారు

రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోంది

టీడీపీ నేతల ఆగ్రహం

జిల్లాలో పలుచోట్ల నిరసనలు

కడప, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంటే సీఎం వైఎస్‌ జగనకు వణుకు అని అందుకే ఆయన పర్యటనను అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. వైసీపీ దౌర్జన్యాలు, దాష్టీకాలను ప్రజలకు వివరించేందుకు, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళుతున్న ఆయనను రేణిగుంట ఎయిర్‌పోర్టులో పోలీసులు నిర్బంధించడం దుర్మార్గమని మండిపడ్డారు. చంద్రబాబును అడ్డుకున్నందుకు నిరసనగా టీడీపీ నేతలు పలుచోట్ల అంబేడ్కర్‌ విగ్రహాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కడప నగరంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద చేపట్టిన నిరసనలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధనరెడ్డి, కడప అసెంబ్లీ ఇనచార్జి అమీర్‌బాబు, టీడీపీ అధికార ప్రతినిధి పీరయ్య, నగర అధ్యక్షుడు జిలానీబాషా, మాసాపేట శివ, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. బద్వేలులో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, డాక్టర్‌ ఓబులాపురం రాజశేఖర్‌, పోరుమామిళ్లలో టీడీపీ కడప పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు శ్వేతశ్రీరెడ్డి, చిన్నమండెంలో టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ తిరుపతి ఎయిర్‌పోర్టులో చంద్రబాబు నిర్బంధం అప్రజాస్వామికమన్నారు. ఇది ముమ్మాటికీ పౌర స్వేచ్ఛను హరించడమేనన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పట్ల పోలీసుల తీరు అమానుషమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలేదని, పోలీసు రాజ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పేరు చెబితేనే జగనరెడ్డి వెన్నులో వణుకు పుడుతోందని అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని, జగన చర్యలు హిట్లర్‌ను తలపిస్తున్నాయని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారని, ప్రజల ఓట్లతో గెలిచే సత్తా లేకనే అధికారం అడ్డుపెట్టుకుని ఏకగ్రీవాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందన్న భయంతో మంత్రులకు ఏకగ్రీవాలు చేసుకోవాలంటూ టార్గెట్‌ ఇచ్చారన్నారు. వైసీపీ మాత్రం వేలాది మందితో సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తుంటే, శాంతియుత నిరసన వ్యక్తం చేస్తామన్న చంద్రబాబు పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కాగా రైల్వేకోడూరు నుంచి రేణిగుంట విమానాశ్రయం వద్దకు వెళ్లిన టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్‌, జిల్లా టీడీపీ యువత అధ్యక్షుడు బొక్కసం సునీల్‌రాయల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రేణిగుంట ఎయిర్‌పోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబును అడ్డుకుని దిగ్బంధనం చేయడం దారుణమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని జగనరెడి ్డ కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న వ్యక్తితో ఈ విధంగా వ్యవహరించడం తగదని, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వస్తున్న ప్రతిపక్ష నేతను అడ్డుకోవడం ప్రభుత్వ నీచ చర్య అని పేర్కొన్నారు.

Updated Date - 2021-03-02T05:14:47+05:30 IST