అమరావతి: ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు టీడీపీ అధినేత చంద్రబాబు మేడే శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని, జగన్ చేతగాని తనంతో లక్షలాది మంది.. భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్న క్యాంటీన్ల ద్వారా పనుల్లేని పేదల ఆకలి తీర్చామని, కార్మికుల సంక్షేమం కోసం టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.