అమరావతి: కుప్పంలో టీడీపీ నేతలపై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు కోరుతూ రాష్ట్ర డీజీపీ గౌతంసవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. దాడికి గురైన వారిని ఆసుపత్రిలో చేర్చుతుంటే కూడా అడ్డుపడ్డారన్నారు. స్థానికంగా ఉన్న అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించడం వల్లనే దాడి చేశారని తెలిపారు. శాంతి భద్రతలు కాపాడే విధంగా పోలీసు చర్యలు ఉండాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి