విశాఖ రాజధానిపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-05-06T01:40:40+05:30 IST

ap రాజధానిపై చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘విశాఖకు అభివృద్ధి కావాలా.. రాజధాని కావాలా’ అని చంద్రబాబు విశాఖ పర్యటనలో స్థానికులను..

విశాఖ రాజధానిపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

విశాఖ: ap రాజధానిపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘విశాఖకు అభివృద్ధి కావాలా.. రాజధాని కావాలా’ అని చంద్రబాబు విశాఖ పర్యటనలో ప్రశ్నించారు. ‘బాదుడే బాదుడే కార్యక్రమం’ పేరుతో చంద్రబాబు జిల్లాల పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా Chandrababu మాట్లాడుతూ ‘‘Amaravathiని రాజధాని చేసి విశాఖను అభివృద్ధి చేస్తానని ఆ రోజు చెప్పా. Vishaka అభివృద్ధికే కట్టుబడి ఉన్నా. రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్లగలను. నన్ను అడ్డుకుంటే ఖబడ్దార్. అత్యాచారాలపై హోంమంత్రి మాటలు బాధ్యతారహిత్యం. టెన్త్ పేపర్ లీక్ అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది. నాడు-నేడు అంటూ పాఠశాలలకు వైసీపీ రంగులు వేశారు. కోర్టు ఆదేశంతో గ్రామ సచివాలయాలకు వేసిన రంగులను మళ్లీ మార్చారు. నా పోరాటం నా కోసం కాదు..మీకోసం. పెళ్లి అయితే కళ్యాణ కానుక.. పండుగ అయితే పండుగ కానుక ఇచ్చాం. Tdp పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. A1, A2 కలసి విశాఖ కబ్జాకు కుట్ర. విశాఖపట్నం సుందర ప్రాంతం. ఒకవైపు అందాల కొండ రిషికొండ. విశాఖ జ్ఞాపకాలను చెరిపేందుకు జగన్ కుట్ర. భూములు, ఖనిజాలు ఎక్కడున్నాయో చూసేందుకే జగన్ పాదయాత్ర. Jagan కన్నుపడితే చాలు ఏదైనా గోవిందా..గోవిందా..’’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.



Read more