చోడవరం: చోడవరం నుంచే జగన్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. చోడవరం నిర్వహించిన టీడీపీ మినీమహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మహిళల పాత్ర కీలకమన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు ఆర్థికంగా చితికిపోయారని తెలిపారు. మహానాడును అడ్డుకునే ప్రయత్నం చేశారని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలను నేతలను వేధిస్తే మీ గుండెల్లో నిద్రపోతానని చంద్రబాబు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి