Abn logo
Jul 4 2020 @ 16:44PM

108,104 వాహనాలపై కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు: ఆళ్ల నాని

అమరావతి:108,104 వాహనాలపై కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఆళ్ల నాని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో 108 వాహనాలు లేక చాలా మంది చనిపోయారని, 108లో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రజాధనం ఆదా చేశామని తెలిపారు. ఒక్కో వాహనానికి రూ. 26 వేలు చొప్పున మొత్తం రూ. 185 కోట్లు ఆదా చేశామన్నారు. 108, 104 వాహనాలను కేంద్ర ప్రభుత్వ ఈ మార్కెట్ పోర్టల్‌లో కొనుగోలు చేశామని తెలిపారు. అరబిందో సింగిల్ బిడ్డర్‌గా వచ్చినా.. రెండో టెండర్‌కు వెళ్లామని చెప్పారు. ఒప్పందం ప్రకారం డీజిల్‌ ధరలు పెరిగినా ప్రభుత్వానికి సంబంధం లేదని పేర్కొన్నారు. ఏడేళ్ల పాటు రేటు పెంచకుండా సేవలు అందించాలని ఒప్పందం చేసుకున్నట్లు ఆళ్ల నాని ప్రకటించారు.

Advertisement
Advertisement
Advertisement