అమరావతి: కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళీపై దాడి చేయడం దుర్మార్గమని టీడీపీ జాతీయ అద్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. మురళీ ప్రాణానికి హాని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతనని చెప్పారు. ఏపీలో వైసీపీ నేతల ఆగడాలు పరాకాష్టకు చేరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిడ్నాప్ చేసి కొట్టడమే కాకుండా.. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలకు ప్రశ్నించేవారు కనబడకూడదా? రాష్ట్రం మీ జాగీరా? అని ప్రశ్నించారు. పోలీసులు తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి