Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీడీపీ నేతలతో చంద్రబాబు అత్యవసర సమావేశం

అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్టు, అనంతర పరిణామాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నేతలతో అత్యవసర భేటీ అయ్యారు. ఉండవల్లిలో తన నివాసం నుంచి జూమ్‌లో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. దేవినేని ఉమపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వైసీపీ నేతలను వదిలిపెట్టి.. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడమేంటని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలను వరుస అక్రమ అరెస్టులు చేస్తున్నారని దీనిపై కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్న అంశంపై చంద్రబాబు పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వర్లరామయ్య, బుద్దా వెంకన్న, కొల్లు రవీంద్ర తదితర టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో వారు ఈ సమావేశంలో పాల్గొనలేకపోయారు. 

Advertisement
Advertisement