ఏలూరు: మాజీ సీఎం చంద్రబాబు కుటుంబాన్ని అసెంబ్లీ సాక్షిగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అవమానించడంపై తెలుగుదేశం పార్టీ నేతలు భగ్గుమన్నారు. చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఏలూరులో నల్ల చీరలు ధరించి వివిధ వర్గాల మహిళల మౌన ప్రదర్శన చేశారు. నిరసనకు అనుమతిలేదని మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మహిళలను బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో రహదారులపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్, ఎమ్మెల్యేలు కొడాలి నాని, అంబటి, వల్లభనేని వంశీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు చేశారు.