మహిళా ఉద్యోగిపై దాడిని ఖండించిన చంద్రబాబు

ABN , First Publish Date - 2020-07-01T03:20:16+05:30 IST

మహిళా ఉద్యోగిపై దాడిని ఖండించిన చంద్రబాబు

మహిళా ఉద్యోగిపై దాడిని ఖండించిన చంద్రబాబు

అమరావతి: మహిళా ఉద్యోగిపై అధికారి దాడి చేయడాన్ని ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఖండించారు. మాస్క్ వేసుకోకుండా కార్యాలయానికి రావడంపై ప్రశ్నించిన తోటి మహిళా ఉద్యోగిపై పర్యాటక శాఖ అధికారి దాడి చేయడాన్ని ఖండిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. మంచి చెప్పిన వికలాంగురాలిపై అధికారి దాడి అమానుషమన్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలనేది కోవిడ్ నామ్స్ లో ప్రధానాంశమని చంద్రబాబు అన్నారు. మాస్క్ లేనందుకు అనేక చోట్ల జరిమానాలు విధించడం తెలిసిందే. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ అనేకమార్లు చెప్పారని, మాస్క్ పెట్టుకోనందుకు ఒక దేశ ప్రధానికి రూ. 13 వేలు జరిమానా విధించారని నరేంద్ర మోదీ గుర్తు చేశారని చంద్రబాబు చెప్పారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి, మంత్రులు మాస్క్ లు ధరించకుండా ఏ సంకేతాలు ప్రజలకు ఇస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. పాలకులే సరైన సంకేతాలు ప్రజలకు ఇవ్వకపోవడం గర్హనీయమని, అందుకే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘యథారాజా తథా ప్రజా’’ అన్నది అందుకే అని, ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ పాలకులు సక్రమ ప్రవర్తన ద్వారా అధికారులు, ప్రజలకు సరైన మార్గదర్శకం చేయాలని చంద్రబాబు సూచించారు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూస్తారని ఆశిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - 2020-07-01T03:20:16+05:30 IST