Abn logo
Sep 25 2021 @ 10:46AM

బాలు శివైక్యం చెంది ఏడాదయ్యిందంటే నమ్మాలనిపించడం లేదు: చంద్రబాబు

అమరావతి: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వర్థంతి నేడు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనను గుర్తు చేసుకున్నారు. బాలు లేరన్న విషయాన్ని నమ్మాలనిపించడం లేదని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ‘‘మైమరపింపచేసే బాలుగారి మధుర గాత్రం పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉంది. అందుకే ఆయన శివైక్యం చెంది ఏడాది అయ్యిందంటే నమ్మాలని అనిపించడంలేదు. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి ప్రథమ వర్ధంతి సందర్భముగా ఆ గాన గంధర్వుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.