Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్లిష్ట సందర్భాల్లో అసెంబ్లీలో రోశయ్య పాత్ర కీలకం : చంద్రబాబు

అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం రోశయ్య చిత్రపటం వద్ద ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఇతర నేతలు నివాళులు అర్పించారు. రెండు నిముషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఏ పదవిలో ఉన్నా రాణించిన వ్యక్తి రోశయ్య అన్నారు. అజాత శత్రువని.. కాంగ్రెస్‌కు రోశయ్య పెద్ద ఆస్తిగా ఉండేవారన్నారు. క్లిష్ట సందర్భాల్లో అసెంబ్లీలో రోశయ్య పాత్ర కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు. 15 సార్లు బడ్జెట్ పెట్టిన చరిత్ర రోశయ్యదన్నారు. రాజకీయంగా రోశయ్యతో విభేదించే వాళ్ళమని కానీ ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ఒక ఇష్యూ తీసుకుంటే దాన్ని సమర్ధవంతగా నిర్వహించేవారన్నారు. రోశయ్య ఒక వ్యక్తి కాదని.. ఒక వ్యవస్థ లాంటి వారన్నారు. రోశయ్య కంఠాన్ని తెలుగు ప్రజలు మరిచిపోలేరని చంద్రబాబు పేర్కొన్నారు.


Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement