AP Assembly Incident : మీ భార్య, తల్లి, చెల్లికి ఇలా జరిగితే బాధపడరా..? : చంద్రబాబు

ABN , First Publish Date - 2021-11-24T18:15:56+05:30 IST

శాసనసభను కౌరవ సభగా మార్చారని.. తాను మళ్లీ గౌరవ సభగా మార్చి ఆ సభకే వస్తానని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. నేడు తిరుపతిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.

AP Assembly Incident : మీ భార్య, తల్లి, చెల్లికి ఇలా జరిగితే బాధపడరా..? : చంద్రబాబు

తిరుపతి: ఏపీ శాసనసభను కౌరవ సభగా మార్చారని.. తాను మళ్లీ గౌరవ సభగా మార్చి ఆ సభకే వస్తానని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. నేడు తిరుపతిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


మీరు బాధపడరా..!

శాసనసభను కౌరవ సభగా మార్చారు. నేను మళ్లీ గౌరవ సభగా మార్చి ఆ సభకే వస్తా. నా సతీమణి గురించి మాట్లాడారు.. బాధనిపించింది. ఎన్టీఆర్‌ బిడ్డ వ్యక్తిత్వాన్ని కించపరిచారు. మీ భార్య, తల్లి, చెల్లికి ఇలా జరిగితే బాధపడరా?. ఇలాంటి ఉన్మాదులతో నేను పోరాడాలా..? దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి.. ప్రజల్లోకి వెళ్దాం. ఇది ప్రజాస్వామ్యం.. ఉన్మాదుల స్వామ్యం కాదు. తప్పుడు పనులు చేసినవారిని ఎవరినీ వదిలిపెట్టను. అలిపిరిలో మందుపాతరలకే నేను భయపడలేదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


ఎవరూ అధైర్యపడొద్దు..!

వరద ప్రాంతాల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు ఎక్కడ..?. వరద బాధితులు చచ్చిపోయిన తర్వాత వచ్చి పరామర్శిస్తారా..?. పోలీసులు వైసీపీకి తొత్తుగా మారారు. నేను అవినీతికి పాల్పడ్డానని ప్రచారం చేసి నిరూపించలేకపోయారు. ప్రశ్నిస్తే నాతో పాటు టీడీపీ నేతల్ని వేధిస్తున్నారు.. కేసులు పెడుతున్నారు. అసెంబ్లీలో మానసికంగా వేధించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే నా గురించి మాట్లాడుతారా?. నా ఇంటిపై... పార్టీ ఆఫీస్‌పై దాడి చేశారు. వైసీపీ నేతలు గంజాయిని డోర్‌ డెలివరీ చేస్తున్నారు. ఎవరూ అధైర్యపడవద్దు.. టీడీపీ అండగా ఉంటుంది. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం జగన్‌రెడ్డి గాలిలో తిరుగుతారా?. వరదసాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. నాపై చేసిన ఆరోపణలు నిరూపించలేకపోయారు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-11-24T18:15:56+05:30 IST