Abn logo
Oct 25 2021 @ 15:09PM

ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం మాఫియా: చంద్రబాబు

న్యూఢిల్లీ: ఏపీలో మద్యపాన నిషేధమని చెప్పి జగన్‌రెడ్డి సొంత వ్యాపారం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం మాఫియా నడుస్తోందని ఆరోపించారు. డ్రగ్స్‌తో యువత నిర్వీర్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కంట్రోల్ చేయమని అడిగితే ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు.


జగన్ గత రెండేళ్లుగా రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయన్నారు. వైసీపీ శ్రేణులు హైకోర్టు జడ్జిలపై కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతున్నారన్నారు. చివరికి పార్లమెంట్ సభ్యుడిపై కూడా పోలీసులు చేయి చేసుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption