అమరావతి (Amaravathi): జగన్మోహన్ రెడ్డి (Jagan) ప్రభుత్వంలో పన్నుల వాతలు... పథకాలకు కోతలు.. ఒంటరి మహిళల పెన్షన్‌లో ఆంక్షలు అమానవీయమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. సోమవారం స్ట్రాటజీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాజధాని కట్టని ప్రభుత్వానికి భూములు అమ్మే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. డబ్బులు పంచినా ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీకి ఓట్లు పెరగలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అమ్మ ఒడి పథకంలో 52వేల మంది లబ్ధిదారులు తగ్గారని చంద్రబాబు అన్నారు. అమరావతిని శ్మశానం అన్న ఈ ప్రభుత్వం..ఇప్పుడు ఎకరా రూ.10కోట్లకు ఎలా అమ్మకానికి పెడుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను పూర్తి చేయకుండా.. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు అద్దెకు ఇవ్వడం అన్యాయమని చంద్రబాబు దుయ్యబట్టారు.
ఇవి కూడా చదవండి