ఆ భూములు వారికే దక్కాలి: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-08-09T16:12:53+05:30 IST

ఆ భూములు వారికే దక్కాలి: చంద్రబాబు

ఆ భూములు వారికే దక్కాలి: చంద్రబాబు

అమరావతి: గిరిజనులకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన సంక్షేమం, హక్కుల పరిరక్షణకు టీడీపీ తొలి నుంచి కృషి చేసిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేయాలని ఆయన సూచించారు. జీవో పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రయత్నం చేయకపోవడం విచారకరమన్నారు. గతంలో టీడీపీ ప్రవేశపెట్టిన బైక్ అంబులెన్సులు ఇప్పుడు లేవన్నారు. మొబైల్ అంబులెన్స్ సేవలు కూడా ఇప్పుడు లేవని పేర్కొన్నారు. 


గిరిజనుల సాంప్రదాయక భూములు గిరిజన తెగలకే దక్కాలని చెప్పారు. కాపాడాల్సిన ప్రభుత్వం గిరిజన భూముల ఆక్రమణ జోరుగా సాగిస్తోందన్నారు. బాక్సైట్ తవ్వకాల ఒప్పందాలను 2016లో తమ ప్రభుత్వం రద్దు చేసిందని చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పుడు లేటరైట్ ముసుగులో బాక్సైట్ దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. బాక్సైట్ దోపిడీ కోసం అడవులు నరికి ఆగమేఘాలమీద రోడ్డు వేసేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతవేగంతో రాష్ట్రంలో ఇంకెక్కడైనా కిలోమీటరు రోడ్డు వేశారా? అని ఆయన ప్రశ్నించారు. తాగునీటి సరఫరాకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నమూ చేయట్లేదన్నారు. ఇప్పటికైనా గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-08-09T16:12:53+05:30 IST