యూరప్‌లో అంబరాన్నంటిన చంద్రబాబు పుట్టినరోజు సంబరాలు

ABN , First Publish Date - 2022-04-21T00:05:52+05:30 IST

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నారై తెలుగుదేశం పార్టీ

యూరప్‌లో అంబరాన్నంటిన చంద్రబాబు పుట్టినరోజు సంబరాలు

ఎన్నారై డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నారై తెలుగుదేశం పార్టీ యూరోప్ టీమ్ కిషోర్ చలసాని ఆధ్వర్యంలో నవీన్ సామ్రాట్ జలగడుగు, శ్రీనివాస్ గోగినేని, శివరాం కూరపాటి, రసూల్ షేక్ మొహమ్మద్, కొత్తపల్లి శ్రీనివాస్ సమన్వయంతో పలు నగరాల్లో అంగరంగ వైభవంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.



Warford Cassiobury Park వద్ద టీడీపీ అభిమానులు, చంద్రబాబు అభిమానులు కేట్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఐటీని ప్రోత్సహించడంతోపాటు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లాగే నవ్యాంధ్రప్రదేశ్‌ను కూడా అభివృద్ధి పథంలో నడిపించారని పేర్కొన్నారు. 2024ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు కృషి చేయనున్నట్టు వెల్లడించారు. చంద్రబాబు తిరిగి ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.




Updated Date - 2022-04-21T00:05:52+05:30 IST