చంద్రబాబు పుట్టినరోజున సూర్య విద్యా సంస్థల వితరణ

ABN , First Publish Date - 2022-04-20T21:38:46+05:30 IST

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో సూర్య కాలేజీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

చంద్రబాబు పుట్టినరోజున సూర్య విద్యా సంస్థల వితరణ

జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో సూర్య కాలేజీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం 5 వార్డులో బెట్రాల్ వారి వీధిలో అంగన్‌వాడి పిల్లలకు గ్లాసులు, ప్లేట్లు  2 కుర్చీలూ, ఒక టేబుల్‌ను సూర్య విద్యాసంస్థల అధినేత కరుటురి రమాదేవి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ నాయకులు కరుటురి రమాదేవి,  రావూరి కృష్ణ, తుటుకుంట రాము, కోనేరు చంటి, గెడ సుబ్రమణ్యం, తెలగరపు జ్యోతి,  పగడం సౌభాగ్యావతి,  నాని, ప్రసాదు,  బొబ్బర రాజ్‌పాల్, కోటగిరి ప్రమీల, పాతూరి అంబేడ్కర్ పాల్గొన్నారు.





Updated Date - 2022-04-20T21:38:46+05:30 IST