Abn logo
Sep 17 2021 @ 20:32PM

చంద్రబాబు ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం: ఎంపీ కనకమేడల

ఢిల్లీ: మాజీసీఎం చంద్రబాబు ఇంటిపై దాడిని ఖండిస్తున్నామని ఎంపీ కనకమేడల రవీంద్ర చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలో కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబును హత్య చేయాలన్న ఆలోచనతోనే దాడి జరిగిందన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. చంద్రబాబు ఇంటి దాడి ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు చేయాలని, ఏపీ ప్రభుత్వం పట్టించుకోకపోతే కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని కనకమేడల రవీంద్ర తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption