‘అఖండ’ విజయంపై బాబు, లోకేష్ ట్వీట్స్

నందమూరి నటసింహం బాలయ్య, మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అఖండ’. గురువారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విజయఢంకా మోగిస్తోంది. బాలయ్య అభిమానులే కాక తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం ఈ చిత్రం విజయం సాధించాలని ఆశించారంటే.. ‘అఖండ’ ప్రభావం ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన స్టార్ హీరో తొలి చిత్రమిది. రాబోయే ఎన్నో పెద్ద చిత్రాలకు దిశా నిర్దేశం చేసే చిత్రంగా వచ్చిన ‘అఖండ’.. అఖండ విజయం సాధించడంతో.. ఇండస్ట్రీ అంతా ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఇండస్ట్రీనే కాదు బాలయ్య కుటుంబ సభ్యులైన చంద్రబాబు, లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ‘అఖండ’ చిత్రం అఖండ విజయం సాధించినందుకుగానూ వారు సంతోషం వ్యక్తం చేస్తూ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 


‘‘అఖండ విజయం సాధించిన ‘అఖండ’ సినిమా హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనివాసరావు, చిత్ర యూనిట్ సభ్యులకు, అభిమానులకు అభినందనలు..’’ అని చంద్రబాబు ట్వీట్ చేయగా.. ‘‘అఖండమైన ఊర మాస్ హిట్ కొట్టిన బాలా మావయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు థమన్, నటీనటులు, చిత్ర బృందానికి అభినందనలు. ఎక్కడ విన్నా ఒక్కటే మాట...జై బాలయ్యా..’’ అంటూ లోకేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. Advertisement