ఇంట్రెస్టింగ్.. ఒకే వేదికపైకి చంద్రబాబు, జగన్‌..

ABN , First Publish Date - 2022-08-15T19:41:12+05:30 IST

ఏపీ సీఎం జగన్(cm jagan), ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) ఒకే కార్యక్రమంలో పాల్గొంటే అది చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది.

ఇంట్రెస్టింగ్.. ఒకే వేదికపైకి చంద్రబాబు, జగన్‌..

అమరావతి: ఏపీ సీఎం జగన్(cm jagan), ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu)  ఒకే కార్యక్రమంలో పాల్గొంటే అది చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది కదా. సాయంత్రం వీరిద్దరూ కలిసి ఓ వేడుకలో  పాల్గొననున్నారు. సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్‌భవన్‌(Raj Bhavan)లో గవర్నర్‌ విశ్వభూషన్ హరిచందన్(Governer Viswabhushan Harichandan) ఇచ్చే తేనీటి విందు (At Home) కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌తో పాటు చంద్రబాబు సైతం హాజరుకానున్నారు. వీరిద్దరూ ఒకే కార్యక్రమంలో పాల్గొనడంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  వీరిద్దరూ మాట్లాడుకుంటారా? కనీసం పలకరించుకుంటారా.. లేదా? అని చూడాలని జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


ఢిల్లీలో ఇద్దరూ పాల్గొనాల్సి ఉన్నా..

మీడియా సైతం సాయంత్రం గవర్నర్ ఇచ్చే తేనీటి విందులో వీరిద్దరిపైనే ఎక్కువగా ఫోకస్ చేయనుంది. ఒకప్పుడు చంద్రబాబు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) కలిస్తే అక్కడంతా ఆహ్లాదకర వాతావరణమే ఉండేది. చూడటానికి కూడా కన్నుల పండువగా ఉండేది. కానీ జగన్ హయాంలో అలాంటి పరిస్థితి లేదు. ఉప్పు-నిప్పు మాదిరిగానే వ్యవహరిస్తారు. గత వారం ఢిల్లీ(Delhi)లో జరిగిన సమావేశంలో ఇద్దరూ పాల్గొనాల్సి ఉన్నా.. చంద్రబాబు హాజరు కాగా.. జగన్ మాత్రం అక్కడి ఉండి కూడా హాజరు కాలేదు. మరుసటి రోజు జరిగిన నీతి అయోగ్(Neeti Ayog) సమావేశంలో పాల్గొన్నారు. కేవలం చంద్రబాబు హాజరవుతున్నారనే జగన్ హాజరు కాలేదని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఇద్దరూ ఈ సాయంత్రం రాజ్ భవన్‌కు వస్తున్నట్లు సమాచారం.


జనసేన అధినేత సైతం..

మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హాజరు అవుతన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ - పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ప్రత్యక్షంగా కలుసుకున్నది లేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. వీరందరి కలయికకు రాజ్ భవన్ వేదిక కానుంది. దీంతో.. ఈ సాయంత్రం రాజ్ భవన లో జరిగే ఎట్ హోం పైన ఆందరిలోనూ ఆసక్తి కనిపిస్తోంది. వీరంతా కలిసి రాజకీయాలను పక్కనబెట్టి మాట్లాడుకుంటారా? లేదంటే ఎడమొహం.. పెడ మొహంగానే ఉంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Updated Date - 2022-08-15T19:41:12+05:30 IST