నేడు చంద్రబాబు రోడ్‌ షో

ABN , First Publish Date - 2021-03-08T05:37:43+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం గుంటూరులో రోడ్‌ షో నిర్వహించనున్నారు.

నేడు చంద్రబాబు రోడ్‌ షో

ఉదయం 10గంటలకు ఆటోనగర్‌కు రాక

సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రచారం

 

గుంటూరు, మార్చి 7(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం గుంటూరులో రోడ్‌ షో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆటోనగర్‌ నుంచి రోడ్‌ షో ప్రారంభమవుతుంది. నగరంలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ ప్రచారం చేస్తారు. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం ఉదయం 9 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు ఆటోనగర్‌ గడ్డిపాడు(ఆటోనగర్‌) నుంచి తూర్పు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి సాయంత్ర 5 గంటల వరకు రోడ్‌షో జరుగుతుంది. ఈ కార్యక్రమం మణిపురం ఫ్లైవర్‌, బీఆర్‌ స్టేడియం, పొన్నూరు రోడ్డు, లాంచస్టర్‌ రోడ్డు, కన్యకాపరమేశ్వరి ఆలయం, పట్నంబజార్‌, కృష్ణమహల్‌ సెంటర్‌, నాజ్‌సెంటర్‌, డొంక్కరోడ్డు, అరండల్‌పేట-4వ లైను, లాడ్జిసెంటర్‌, అమరావతి రోడ్డు, లక్ష్మీపురం,  బృందావన్‌గార్డెన్స్‌,  కుందలరోడ్డు, స్వామీ ఽథియేటర్‌, జూట్‌మీల్‌ ఫ్లైవర్‌, ఏటీ ఆగ్రహారం, చుట్టుగుంటసెంటర్‌, ఐటీసీ, నల్లచెరువు వరకు కొనసాగుతుంది. 


 

Updated Date - 2021-03-08T05:37:43+05:30 IST