చంద్రబాబు, లోకేష్‌ త్వరగా కోలుకోవాలని పూజలు

ABN , First Publish Date - 2022-01-21T05:13:12+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కసుమూరు మస్తాన్‌వలీ దర్గాలో గురువారం నెల్లూరు పార్లమెంటు తెలుగుయువత ఆధ్వర్యంలో నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చంద్రబాబు, లోకేష్‌ త్వరగా కోలుకోవాలని పూజలు
కసుమూరు దర్గాలో పూజలు చేస్తున్న నెల్లూరు పార్లమెంటు తెలుగుయువత నాయకులు

వెంకటాచలం, జనవరి 20 : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కసుమూరు మస్తాన్‌వలీ దర్గాలో గురువారం నెల్లూరు పార్లమెంటు తెలుగుయువత ఆధ్వర్యంలో నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా తెలుగుయువత నాయకులు నెల్లూరు నుంచి మోటర్‌ బైక్‌ ర్యాలీ నిర్వహించగా వెంకటాచలంలో మాజీ మండల కోప్షన్‌ సభ్యుడు పఠాన్‌ ఖయ్యుమ్‌ ఖాన్‌, సర్వేపల్లి నియోజక వర్గ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి షేక్‌ అబ్దుల్లా, తెలుగుయువత మండల అధికార ప్రతినిధి సయ్యద్‌ అన్వర్‌ తదితరులు మోటర్‌ బైక్‌ ర్యాలీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం కసుమూరు దర్గాకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు తెలుగుయువత అధికార ప్రతినిధి వేమా హజరత్‌ శెట్టి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆకుల రాజేష్‌, కార్యదర్శులు షేక్‌ రఫి, ఇలియాజ్‌, 29వ డివిజన్‌ ఇన్‌చార్జి గుద్దేటి చెంచయ్య, సత్తార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

చంద్రబాబు కోలుకుని.. ప్రజల్లోకి రావాలి

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి


తోటపల్లిగూడూరు, జనవరి 20 : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,  నారా లోకేష్‌బాబు కరోనా నుంచి త్వరగా కోలుకుని.. ప్రజల్లోకి రావాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని సౌత్‌ఆములూరులో గురువారం గ్రామదేవత ఆములూరమ్మ ఆలయంలో గుడ్లూరు గోపాల్‌నాయుడు ఆధ్వర్యంలో 101 కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బొమ్మి సురేంద్ర మాట్లాడుతూ చంద్రబాబునాయుడు కరోనా నుంచి కోలుకొని ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాడాలన్నారు.  కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు సన్నారెడ్డి సురేష్‌రెడ్డి,  ఎంపీటీసీ కొణతం రఘుబాబు, తిరుపతి పార్లమెంటు ఇన్‌చార్జి రాధాకృష్ణనాయుడు, ఇస్కపాలెం సర్పంచు ఇంగిరాల చైతన్య, నాయకులు ముత్యాలు శ్రీనివాసులు, తెలుగు యువత అధ్యక్షుడు కిరణ్‌, మద్దిన శ్రీధర్‌, రమేష్‌, గంగాధర్‌, మునిరత్నం,  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T05:13:12+05:30 IST