Ongole: జగన్ తనను తాను కాపాడుకోడానికి కేంద్ర చేతిలో కీలుబొమ్మగా మారాడని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. మహానాడులో జగన్ పాలనపై ఆయన విరుచుకుపడ్డారు. అమరావతిని చంపేశాడని విమర్శించారు. పోలవరం పూర్తవుతుందన్న నమ్మకం లేదన్నారు. ఎన్టీఆర్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు తీసేస్తే.. జగన్ వచ్చి మీటర్లు పెడుతున్నాడని.. మీటర్లు బిగించకుండా రైతులు పోరాడాలని.. అందుకు మేం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రత్యేక హోదా గురించి ఎన్నికల ముందు జగన్ చాలా చెప్పాడని..కేంద్రం మెడలు వంచుతానన్న జగన్.. ప్రస్తుతం అదే కేంద్రం కాళ్ల మీద పడే పరిస్థితి దాపురించిందన్నారు. పోలవరం, రైల్వే జోన్, విశాఖని జగన్ తాకట్టు పెట్టారని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి