చాందిని బండి ఊరేగింపు

ABN , First Publish Date - 2022-05-17T06:10:20+05:30 IST

సోమవారం రాత్రి బలిజపేట శ్రీరామదే వాలయం నుంచి ప్రత్యేక అలంకరణలో చాందిని బండితో ఊరేగింపుగా ఏటిగంగమ్మ ఆలయానికి చేరుకున్నారు.

చాందిని బండి ఊరేగింపు
ప్రత్యేక అలంకరణలో చాందిని బండి


తలుపుల, మే 16: మండల కేంద్రంలోని ఎగువ పేట సమీపంలో ని గిడివా గు పక్కన వెలసిన గ్రామ దేవత ఏటిగంగమ్మ జాతర ను ఘనంగా నిర్వహిస్తు న్నారు. అందులో భాగంగా రెండోరోజు సోమవారం రాత్రి బలిజపేట శ్రీరామదే వాలయం నుంచి ప్రత్యేక అలంకరణలో చాందిని బండితో ఊరేగింపుగా  ఏటిగంగమ్మ ఆలయానికి చేరుకున్నారు. బండిలో నవ ధాన్యాల మొలకలను తీసు కెళ్లి, అమ్మవారికి నైవేద్యం చేశారు. అలాగే మహిళలు, బాలికలు నవధాన్యాల మొలకలను నెత్తిపై పెట్టుకొని, చాందిని బండి వెంట ఊరేగింపుగా వెళ్లి, అమ్మవారికి సమర్పించారు. సోమవారం ఉదయం నుంచి ఆలయ పూజారి లక్ష్మీనరసింహశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణంలో గూ టిభైలు గ్రామానికి చెందిన వారు వినిపించిన తిమ్మమాంబ హరికథ భక్తుల ను ఆకట్టుకుంది. పులివెందుల, రాయచోటి, నిగిడి గ్రామానికి చెందిన చెక్కభ జన కళాకారులు రామాయణ, భారత ఇతిహాసగాథలను ప్రదర్శించారు.


Updated Date - 2022-05-17T06:10:20+05:30 IST