మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..
ABN , First Publish Date - 2021-03-07T18:08:03+05:30 IST
చండీగఢ్‌లో ఒక మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్...
ఒకవైపు ఏడ్చే పిల్లాడు... మరోవైపు దూసుకొచ్చే వాహనాలు
రెండింటీనీ కంట్రోల్ చేస్తున్న మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్
చండీగఢ్: చండీగఢ్‌లో ఒక మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ తన ఏడాది పిల్లాడిని చంకనేసుకుని విధులు నిర్వహిస్తుంటారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చూస్తుండగానే ఈ వీడియోకు వేల లైక్‌లు వచ్చాయి. చండీగఢ్‌కు చెందిన మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రియాంక సెక్టార్ 15-23లో తన కుమారుణ్ణి ఎత్తుకుని డ్యూటీ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ ‘నా కుమారుడు చాలా చిన్నవాడు. నన్ను విడిచి వాడు ఉండలేడు. అందుకే నా భర్త లేదా కుటుంబ సభ్యులు నా కుమారుడిని తీసుకుని నా దగ్గరకు వస్తుంటారు. పిల్లాడు ఏడిస్తే నేనే మరిపించాల్సివస్తుంది. ఇదే సమయంలో నాకు డ్యూటీ కూడా ఎంతో ముఖ్యం’ అని అన్నారు.
‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో...