Abn logo
Jul 12 2020 @ 23:46PM

రూ. 2 వేలు ఇవ్వలేదని గర్ల్‌ఫ్రెండ్‌పై శానిటైజర్ చల్లి.. ఆ తరువాత..

చండీగఢ్: రెండు వేల రూపాయలు ఇవ్వలేదని ఓ కిరాతకుడు తన గర్ల్ ఫ్రెండ్ ముఖాన్ని శానిటైజర్‌తో తగలబెట్టిన ఘటన చండీగఢ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆమె ముఖం ఇరవై శాతం కాలిపోయిందని పోలీసులు తెలిపారు. ఆమె ఆర్తనాదాలు విన్న ఇరుగు పొరుగు వారు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారని తెలిపారు. కేవలం డబ్బుల కోసమే అతడు ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని వారు చెప్పారు. కాగా.. బాధితురాలి వాగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు. డబ్బుల కోసం అతడు బాధితురాలిని తరచూ వేధించేవాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని వారు అదుపులోకి తీసుకున్నారు.


Advertisement